‘ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు’ | - | Sakshi
Sakshi News home page

‘ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు’

Feb 11 2026 7:33 AM | Updated on Feb 11 2026 7:33 AM

‘ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు’

‘ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు’

ఆదిలాబాద్‌రూరల్‌: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఆదిలాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను భయబ్రాంతుల కు గురి చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మావలలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఆదిలాబాద్‌ పట్టణాన్ని రూ.కోట్లాది ని ధులు వెచ్చించి అభివృద్ధి చేశామని, రాష్ట్రంలో అధి కారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న కాంగ్రెస్‌ ఆదిలా బాద్‌ మున్సిపాలిటీకి నయాపైసా ఇవ్వలేదని ఆరో పించారు. పట్టణంలోని ఓ వార్డులో డబ్బులు పంపిణీ చేస్తున్నారని తమ పార్టీకి చెందిన కార్యకర్తలు 100కు డయల్‌ చేస్తే సకాలంలో స్పందించకుండా పంపిణీ పూర్తి అయిన తర్వాత వచ్చారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానులేనని, అయితే పోలీసులు, అధికారులు దానిని విస్మరిస్తున్నారని ఆరోపించారు. రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కోర్టులో స్టే ఉందని, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఎన్ని కలు దృష్టిలో ఉంచుకోని నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన పలువురి రౌడిషిట్‌ కేసులు ఉన్నప్పటికీ అలాంటి వారిని బైండోవర్‌ చేయకుండా తమ పార్టీకి చెందిన నాయకులను బైండోవర్‌ చేస్తున్నారని విమర్శించా రు. ఆయా పార్టీలు ఏం చేసినా ఆదిలాబాద్‌ మున్సి పాలిటీపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు నారాయణ, శ్రీకాంత్‌, ఉమాకాంత్‌రెడ్డి, సుధీర్‌, కిరణ్‌, సృజన్‌, ఆజీం, ప్రసాద్‌, ఆసీఫ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement