టీటీడీసీలో సందడి..
ఎన్నికల విధులు నిర్వహించనున్న సిబ్బంది మంగళవారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నా రు. టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకుని ప్రత్యేక వాహనాల్లో బందోబస్తు నడుమ తరలివెళ్లారు. అంతకు ముందు ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన విధానాలపై మాస్టర్ ట్రైనర్లు వారికి ప్రత్యేక అవగాహన కల్పించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి పరిశీలించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంతు నాయక్, ఎస్పీ అఖిల్ మహా జన్, అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తదితరులున్నారు.
టీటీడీసీలో సందడి..


