సేవాలాల్ జయంతి ఘనంగా నిర్వహించాలి
కై లాస్‌నగర్: బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో వే డుకల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 18న జిల్లాకేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించాలన్నారు. తండాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పా ట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేడుకల ప్రాంగణాల్లో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి వసతులు కల్పించాలన్నారు.భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పో లీస్‌శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ రద్దీ నివారణకు అవసరమైన మళ్లింపులు చేపట్టాలని సూచించారు. పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అత్యవసర పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్య శిబిరా లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే అంబులె న్స్‌లను సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. సేవాలాల్ బోధనలు, ఆయన స మాజ సేవను యువతకు తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూ చించారు. అనంతరం వేడుకల ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, గిరిజన సంక్షేమ శా ఖ, పోలీస్ శాఖల అధికారులు, బంజారా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


