రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీం స్టే | Supreme court issues notice to Tamilnadu government and all the convicts | Sakshi
Sakshi News home page

రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీం స్టే

Feb 20 2014 1:19 PM | Updated on Sep 2 2018 5:20 PM

రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీం స్టే - Sakshi

రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీం స్టే

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది.

న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ వారిని విడుదల చేయరాదని న్యాయస్థానం ఆదేశించింది. రాజీవ్ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని నోటీసులు జారీ చేసింది.

రాజీవ్‌గాంధీ హంతకుల మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మరుసటి రోజే వారిని విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తమిళనాడు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయంపై రాజీవ్ గాంధీ హత్య అనేది భారతదేశం మీద జరిగిన దాడి అని, ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయొద్దని తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సూచించారు.

మరోవైపు రాజీవ్ హత్యకేసులో దోషులు నళిని, మురుగన్ల కుమార్తె హరిత్ర రాహుల్ గాంధీని క్షమాపణ కోరింది. చేసిన నేరానికి తన తల్లిదండ్రులు శిక్ష అనుభవించటంతో పాటు, పశ్చాత్తాపం చెందారని వారిని క్షమించి వదిలేయాలని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement