గురక పెడితే.. ఊరుకోదు | Snore no more: smart pillow 'nudges' noisy sleepers | Sakshi
Sakshi News home page

గురక పెడితే.. ఊరుకోదు

Feb 18 2014 6:01 AM | Updated on Jul 11 2019 6:33 PM

గురక పెడితే.. ఊరుకోదు - Sakshi

గురక పెడితే.. ఊరుకోదు

పిల్లి అరుపులా.. నక్క కూతలా.. ఇంజిన్ స్టార్ట్ చేసినట్లు.. ఇలా గురక పెట్టడంలో ఎవరి స్టైల్ వారిది. వారి సంగతెలా ఉన్నా.. పక్కన పడుకునేవారికి మాత్రం అది నరకమే.

పిల్లి అరుపులా.. నక్క కూతలా.. ఇంజిన్ స్టార్ట్ చేసినట్లు.. ఇలా గురక పెట్టడంలో ఎవరి స్టైల్ వారిది. వారి సంగతెలా ఉన్నా.. పక్కన పడుకునేవారికి మాత్రం అది నరకమే. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతుంది ఈ వినూత్న తలగడ. ఇందులో ఉండే మైక్రోఫోన్లు గురక తాలూకు కంపనాలను గ్రహిస్తాయి. వెంటనే.. ఇందులోని ఎయిర్‌పాకెట్ నెమ్మదిగా ఉబ్బడం ప్రారంభిస్తుంది. అది గురక పెడుతున్నవారి తల లేదా శరీరం కదిలేలా చేస్తుంది. దీని వల్ల వారి గురక ఆగుతుంది. అప్పటికీ ఆగకుంటే.. ఇది బాగా ఉబ్బుతుంది.. లేదా చిన్నగా తట్టినట్లు చేసి.. వారిని నిద్రలేపుతుంది. ఏ స్థాయి గురక పెడితే.. ఎయిర్ పాకెట్ ఉబ్బాలి అన్నదాన్ని మనం ఇందులో ఉండే బటన్ల ద్వారా సెట్ చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన ఆన్‌లైన్ రీటైలర్ హెమాకర్ ష్లెమర్ ఈ తలగడను విక్రయిస్తోంది. ధర రూ.9 వేలకు పైనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement