
తమతో ఫోటోలు దిగాలని వేధింపులు
ముసుగు ధరించి వచ్చిన దుండగులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోకి చొరబడి ఇద్దరు బాలికలపై కత్తులపై దాడి చేసిన ఘటన తమిళనాడులోని తిరునవ్వేలిలో కలకలం రేపింది.
తిరునవ్వేలి: ముసుగు ధరించి వచ్చిన దుండగులు గురువారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోకి చొరబడి ఇద్దరు బాలికలపై కత్తులపై దాడి చేసిన ఘటన తమిళనాడులోని తిరునవ్వేలిలో కలకలం రేపింది. గాయపడిని బాలికలను అంబాయ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగడంతో కడలూరు-పొత్తపాతూరు మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది.
అయితే గతవారం రోజులుగా బాలికలను కత్తులతో బెదిరించి అల్లరి పెడుతున్న ఐదుగురిలో ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తమతో కలిసి సెల్ఫోన్ లో ఫోటోలు దిగాలని బాలికలను వేధించారని పోలీసులు తెలిపారు. పారిపోయి ముగ్గురు ఇద్దరు బాలికలపై దాడికి పాల్పడివుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.