ట్రంప్ పై ట్వీట్.. ఇరకాటంలో పడ్డ మెక్డి | 'Hacked' McDonald's Serves Anti-Trump Tweet. Twitter Is Lovin' It | Sakshi
Sakshi News home page

ట్రంప్ పై ట్వీట్.. ఇరకాటంలో పడ్డ మెక్డి

Mar 17 2017 9:43 AM | Updated on Sep 5 2017 6:21 AM

ట్రంప్ పై ట్వీట్.. ఇరకాటంలో పడ్డ మెక్డి

ట్రంప్ పై ట్వీట్.. ఇరకాటంలో పడ్డ మెక్డి

ట్రంప్ కు వ్యతిరేకంగా నమోదైన ట్వీట్ తో అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ ఇరకాటంలో పడింది.

న్యూఢిల్లీ : అకౌంట్లు హ్యాక్ అవడం.. అకౌంట్లను హ్యాక్ చేసి పోస్టు చేసే ట్వీట్లతో కంపెనీలు, ప్రముఖులు ఇరకాటంలో పడటం గమనిస్తుంటాం. ప్రస్తుతం అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ కూడా ఇదే సమస్యలో చిక్కుకుంది. ఎవరో మెక్ డొనాల్డ్స్ అకౌంట్ ను హ్యాక్ చేసి, ట్రంప్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సంచలనం సృష్టించింది. తమ అకౌంట్ హ్యాకింగ్ కు గురైనట్టు గుర్తించిన కంపెనీ, 20 నిమిషాల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా నమోదైన ట్వీట్ ను డిలీట్ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిపోయి, ఆ ట్వీట్ 200 సార్లు రీట్వీట్ అయింది.
 
''డొనాల్డ్ ట్రంప్...మీరు చాలా విసుగు తెప్పిస్తున్నారు, ప్రెసిడెంట్ గా అవసరం లేదు. బరాక్ ఒబామా తిరిగి రావడాన్ని మీము ప్రేమిస్తాం. ప్లస్ మీరు చాలా చిన్న చేతులు కలిగిఉన్నారు. '' అని ట్వీట్ చేశారు. చిన్న చేతులు కలిగి ఉండటాన్ని తక్కువ సాయం చేస్తారనడంలో ఎక్కువగా వాడుతుంటారు. ఈ ట్వీట్లో ఇదే హైలెట్ గా నిలిచింది. ఈ ట్వీట్ పై స్పందించిన కంపెనీ తమ అకౌంట్ హ్యాక్ అయిందని, దీనిపై ఇప్పటికే విచారణ చేపట్టినట్టు ట్వీట్ చేసింది. అయితే ట్రంప్ కు వ్యతిరేకంగా నమోదైన ఈ ట్వీట్ కు మాత్రం అనూహ్య స్పందన వస్తోంది. ట్విట్టర్లో చాలామంది కంపెనీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కంపెనీ ఇప్పటివరకు చేసిన ట్వీట్లలో బెస్ట్ గా పేర్కొంటున్నారు. ఆ ట్వీట్ ను మళ్లీ పోస్టు చేస్తే, 100 మెక్ నగ్గెట్స్ కొంటామంటూ ఆఫర్ కూడా చేస్తున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement