బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా? | Gold hits 6-week high of Rs. 29,450 on global cues | Sakshi
Sakshi News home page

బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా?

Jan 13 2017 3:50 PM | Updated on Sep 5 2017 1:11 AM

బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా?

బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా?

శుక్రవారం భారీగా లాభపడిన పుత్తడి ఆరు వారాల గరిష్ఠానికి తాకింది.

ముంబై:  డాలర్  బలంతో ఇటీవల  వెలవెలబోయిన బంగారం ధరలు మళ్లీ పరుగు అందుకున్నాయి.  ఈ మధ్య కాలంలో పది గ్రా. రూ.26వేల స్థాయిని టచ్ చేసిన పుత్తడి ధర మళ్లీ రూ.30 వేల స్థాయి దిశగా కదులుతోంది. శుక్రవారం భారీగా లాభపడిన పుత్తడి ఆరు వారాల గరిష్ఠానికి తాకింది.  వరుసగా నాలుగో రోజూ రైజింగ్  లో ఉన్న  బంగారం ధర రూ. 200 ఎగిసి  రూ.29,450 (10 గ్రా)గా ఉంది.  సిల్వర్ ధరలు మాత్రం రూ.300 క్షీణించి రూ.41 వేల స్థాయి కిందికి దిగజారి కిలో రూ. 40,950 గా ఉంది.

ప్రపంచ సానుకూల సంకేతాలతో  వ్యాపారులు సెంటిమెంట్ బలపడినట్టు  మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే రాబోయే పెళ్లిళ్ల సీజన్,  చిల్లర వర్తకుల  డిమాండుకు, తోడు  స్థానిక నగల  వ్యాపారుల కొనుగోళ్లు  పసిడి ధరల్లో జోష్ పెంచాయంటున్నారు.

ప్రపంచవ్యాపితంగా  0.33 శాతం  పెరిగి ఔన్స్ బంగారం ధర  1,195 వద్ద ఉందివ.   న్యూయార్క్ లో ఔన్స్ వెండి 0.30 శాతం ఎగిసి వరకు 16.74 డాలర్ల వద్ద ఉంది.  దేశరాజధానిలో 99.9 శాతం 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు వరుసగా రూ.29,450 , రూ.. 29,300  స్థాయిలో  ధగధగ లాడుతున్నాయి. ఈ స్థాయి ధరలు గత నవంబరు 29 న నమోదు కాగా, గత మూడు సెషన్లలో రూ.550  పెరిగింది. సావరిన్ గోల్డ్  8 గ్రా.రూ. 24,300  స్థిరంగా ఉన్నాయి. అయితే ఎంసీక్స్ మార్కెట్ లో పదిగ్రా.  స్వల్పంగా క్షీణించి రూ. 28,378 వద్ద ఉంది.

,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement