‘ఫెడరల్ ఫ్రంట్’పై మమతతో బాబు చర్చలు | Sakshi
Sakshi News home page

‘ఫెడరల్ ఫ్రంట్’పై మమతతో బాబు చర్చలు

Published Tue, Feb 11 2014 3:46 AM

Chandrababu Naidu meets Mamata Banerjee to discuss federal front

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సమాఖ్య కూటమి(ఫెడరల్ ఫ్రంట్) ఏర్పాటుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారమిక్కడ తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. సెక్రటేరియట్‌లో మమతతో సమావేశమైన ఆయన తమ భేటీ సానుకూలంగా సాగిందని తర్వాత విలేకర్లతో అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వివిధ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ ఆ ఫ్రంట్‌కు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 అయితే ఫెడరల్ ఫ్రంట్‌లో ఏ పార్టీలు ఉంటాయన్నదానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ పై స్పందించాలని కోరగా దానికి తమ పార్టీ వ్యతిరేకమన్నారు. ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం కోసం కాంగ్రెసేతర,బీజేపీయేతర పార్టీలు చేతులు కలపాలని మమత పిలుపునివ్వడం తెలిసిందే. ‘మూడో కూటమి’ ఏర్పాటుపై జేడీయూ నేత నితీశ్, వామపక్షాల, ఇతర పార్టీల నేతలు ఢిల్లీలో జేడీఎస్ చీఫ్ దేవెగౌడ ఇంట్లో అనధికారికంగా సమావేశమై చర్చిం చిన నేపథ్యంలో బాబు మమతతో భేటీ అయ్యారు.

Advertisement
Advertisement