కౌసర్‌ షాహిన్‌..

Womens Savings Society In Warangal - Sakshi

ధర్మసాగర్‌: కష్టాల కడలిలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ మహిళకు పొదుపు సంఘం దారి చూపి జీవితాన్నే మలుపుతిప్పింది. వరంగల్‌ జిల్లా వేలేరు మండల కేంద్రానికి చెందిన కౌసర్‌ షాహిన్‌ పదో తరగతి పూర్తి కాగానే 16 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు వివాహం చేయడంతో అత్తారింట్లో అడుగుపెట్టింది. అధిక సంతానంతో కడు పేదరికంలో ఉన్న అత్తారింట్లో తెలిసి తెలియని వయసులోనే కష్టాలు పడుతూ కాపురం చేసింది. వెను తి రిగి చూస్తే 25 సంవత్సరాలు వచ్చే వరకు బాబు, పా పతో బాధ్యతలు మొదలయ్యాయి. కష్టం చేసి పోషిం చాల్సిన భర్త తాగుడుకు బానిస కావడంతో తప్పని సరి పరిస్థితుల్లో భర్త నుంచి దూరంగా ఉండే ఉద్దేశ్యం తో సొంతూరు వేలేరుకు పిల్లలతో సహ చేరింది.

వ్యవసాయ కూలీగా..
గ్రామానికి చేరిన కౌసర్‌ షాహిన్‌ తను, తన పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో వ్యవసాయ కూలీగా పని చేస్తూ.. వచ్చిన కొద్ది మొత్తాన్ని జాగ్రత్తగా పొదుపు చేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటుంది. పిల్లలు ఎదగడం, నిత్యం పని కోసం ఎదురుచూడడం, కొన్ని సందర్భాల్లో పూట గడవడమే కష్టంగా మారేది. దీంతో తాను ఎంత కష్టపడైనా సరే జీవితంలో తన పిల్లలకు తనలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని ధృడసంకల్పానికి వచ్చింది.

మలుపు తిప్పిన పొదుపు సంఘం..
ఈ క్రమంలోనే గ్రామంలో కనకదుర్గ మహిళా పొదుపు సంఘం ప్రారంభిస్తున్నామని, తనను కూడా అందులో చేరమని ఇంటి పక్కన మహిళలు ఇచ్చిన సమాచారంతో తల్లిదండ్రులతో చెప్పకుండానే అందులో సభ్యురాలిగా చేరింది కౌసర్‌ షాహిన్‌. సంఘంలో చేరిన తొలి రోజుల్లో సంఘంలో పొదుపు చేయటం, ఇంట్లో వారికి తెలియకుండా సంఘం మీటింగ్‌లకు హాజరవుతుండేది. ఈ నేపథ్యంలో తొలిసారిగా 2007వ సంవత్సరంలో సంఘం అప్పు తీసుకుని కుట్టుమిషన్‌ కొనుగోలు చేసింది. అనంతరం వ్యవసాయ కూలీతోపాటు, కుట్టుమిషన్‌ ద్వారా వచ్చే ఆదాయంతో ఇద్దరు పిల్లలను పోషించేది. అప్పటి వరకు కూడా అరకొరగా రాబడి ఉండటంతో ఇబ్బందులు సైతం వెంటాడుతూనే ఉన్నాయి.

2011లో కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌ (సీఆర్‌పీ)గా ఇతర రాష్ట్రాల్లోని మహిళలకు శిక్షణ ఇచ్చి మహిళా పొదుపు సంఘాలపై అవగాహన కల్పించే అవకాశం వచ్చింది. ఇంట్లో వాళ్లు వ్యతిరేకించినప్పటికీ వారికి సమాధానం చెప్పి, ఓరుగ ల్లు మహిళా సమాఖ్య నుంచి మధ్యప్రదేశ్‌లో మహిళలకు శిక్షణ ఇచ్చింది. అది మొదలు ఇప్పటి వరకు 8 రాష్ట్రాల్లో సీఆర్‌పీగా సేవలు అందించి వేల మంది మ హిళలకు అవగాహన కల్పించింది. అందులో ప్రతి శిక్షణలో తన జీవితాన్నే పాఠంగా చెబుతూ మహిళా సం ఘంలో చేరటం ద్వారా లా భాలను వివరిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలు స్తుంది కౌసర్‌ షాహిన్‌. ఈ క్రమంలోనే ఆర్థికంగా నిలదొక్కుకుని తన బాబు, పాప ను ఓ ప్రైవేట్‌ విద్యాసంస్థలో చేర్పించి చదువు చెప్పిస్తుం ది. కాగా  ఈ నెల 12వ తేదీ న ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడే అవకాశం దక్కడంతో అన్ని వైపుల నుంచి ప్ర శంసలు వెల్లువెత్తటంతో పా టు, తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అంబాసిడర్‌గా కూడా ఎం పికైంది.  

మహిళా సంఘం ప్రోత్సాహం మరువలేనిది..
నేను ఈ స్థాయిలో నిలిచేందుకు తోటి మహిళా సంఘం సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. సంఘంలో చేరిన తొలి రోజుల్లో ఎవరితో మాట్లాడాలన్నా భయంగానే ఉండేది. క్రమంగా అందరితో కలిసిపోయాను. బయటి రాష్ట్రాలకు వెళ్లినప్పుడు సైతం ఇబ్బందులు ఎదురైన సందర్భాల్లో తోటి సభ్యులు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. సీఆర్పీగా ఎంపికై ప్రధానీతో మాట్లాడే వరకు నాటి ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్‌ తక్కళ్లపల్లి రవీందర్‌రావు సార్‌ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అర్బన్‌ జిల్లా అంబాసిడర్‌గా పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తా.


– కౌసర్‌ షాహిన్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top