సభ్యత్వం కోసమైతే వస్తావా? చావుకు రావా?  | Revanth Reddy Criticized the Central and State Governments Over the TSRTC Strike | Sakshi
Sakshi News home page

సభ్యత్వం కోసమైతే వస్తావా? చావుకు రావా? 

Nov 23 2019 5:33 PM | Updated on Nov 23 2019 6:43 PM

Revanth Reddy Criticized the Central and State Governments Over the TSRTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మూడు వేల కోట్ల అప్పు ఉన్న ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తానంటే మరి 30 వేల కోట్ల అప్పు ఉన్న మెట్రోను ఏం చేస్తవని మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె శనివారానికి 50 రోజులకు చేరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యత్వం కోసం తెలంగాణకు వచ్చే అమిత్‌ షా, కార్మికులు చనిపోయినా స్పందించడం లేదన్నారు. ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందంటున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల చావులను మాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. వారి చావులను కూడా 66 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 33 శాతం కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఖరి ఒక్కటేనంటూ, ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement