ఫాంహౌస్‌లో గుట్కా దందా | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌లో గుట్కా దందా

Published Wed, Jul 1 2020 9:32 AM

Illegal Quid Sales In Adilabad District - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : మండలంలోని పూసాయి గ్రామ సమీపంలోని పరేష్‌ రావ్‌రానికు చెందిన ఫాంహౌస్‌లో రూ.30 లక్షల విలువగల గుట్కాను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ మల్లేశ్, ఎస్సై వెంకన్న వివరాల ప్రకారం... ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన షమీ ఉల్లాఖాన్‌ అలియాస్‌ షమ్మీ రావ్‌రానికి చెందిన ఫాంహౌస్‌లో గుట్కా నిల్వ ఉంచి అక్కడి నుంచి ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి నిర్వహించారు. గుట్కాతో పాటు ఇన్నోవా వాహనం (ఏపీ09 సీపీ 1989)ను సీజ్‌ చేసి అక్కడే ఉన్న భూషన్‌ త్రిపాఠి, నదీమ్‌ ఖాన్‌లను అదుపులో తీసుకుని విచారించగా సరుకు షమీ ఉల్లాఖాన్‌కు చెందినదిగా చెప్పారు. దీంతో ఉల్లాఖాన్‌ను ఏ1గా, భూషన్‌ త్రిపాఠి, నదీమ్‌ఖాన్, పరేష్‌ రావ్‌రానిలను ఏ2, ఏ3, ఏ4లుగా చేర్చి కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గుట్కాను జైనథ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఏ1, ఏ4లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

సంవత్సరకాలంగా దందా
సంవత్సరకాలంగా ఫాంహౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా గుట్కా నిల్వ, రవాణా కొనసాగుతున్నట్లు చుట్టుపక్కక రైతులు తెలిపారు. ఇక్కడ తరుచుగా లారీలు, ఐచర్‌లు, ఇ తర వాహనాలు వస్తూ పోతుంటాయని చెబుతున్నారు. అ యితే ఊరికి దూరంగా, 44వ నంబరు జాతీయ రహదారి కి కూత వేటు దూరంలో ఫాంహౌస్‌ ఉండటంతో గుట్కా దందా జోరుగా సాగింది. మహారాష్ట్ర సరిహద్దు కూడ పక్కనే ఉండటం ఆదిలాబాద్, జైనథ్, బేల, తాంసి, తలమడుగు ఇతరాత్ర మండలాలకు ఇక్కడి నుంచి గుట్కా సప్‌లై చేయడానికి అవకాశం ఉండటంతో అడ్డు అదుపు లేకుండా దందా కొనసాగింది. విశ్వసనీయ సమాచారం మేరకు జైనథ్‌ ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు దా డి చేయగా, ఫాంహౌస్‌లో భారీ గుట్కా లభించింది.

అయితే ఆ ఫాంహౌస్‌లో లోపల మొత్తం బెడ్‌రూం, హాల్, కిచె న్, బాత్‌రూంలో సైతం గుట్కా బస్తాలను కుక్కి ఉండటం చూసి పోలీసులు కంగుతిన్నారు. ఇప్పటి వరకు మండలంలో ఇంత పెద్ద ఎత్తున గుట్కా ఎప్పుడు స్వాధీనం కాకపోవడంతో మండలంలో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మా రింది. పట్టుబడిన గుట్కా ప్రింట్‌ విలువ రూ.30లక్షల వ రకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ నిషే ధిత గుట్కా మార్కెట్‌ విలువ మాత్రం ప్రింట్‌ రేట్‌కు 3 నుంచి 5 రేట్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం గుట్కా అమ్మకాలను నిషేధించడంతో వ్యాపారులు రూపాయి విలువ చేసే గుట్కాను రూ.3 నుంచి రూ.5కు అమ్ముతున్నారు.

ఈ లెక్కన దీని విలువ సుమారు కోటి రూపాయలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మహారాష్ట్ర పక్కనే ఉండటంతో జైనథ్‌ మీదుగా జోరుగా గుట్కా దందా కొనసాగుతుందని ఈ ఉదాంతం స్పష్టం చేస్తోంది. చి న్నచిన్న గ్రామాల్లో సైతం ఈ రోజు నిషేధిత గుట్కా విరి విగా లభిస్తుంది. అప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని గుట్కా అక్రమ రవాణా, అమ్మకాలను అరికట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement