శివరాత్రి పండుగ సందర్భంగా పండ్ల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి.
రంగారెడ్డి: శివరాత్రి పండుగ సందర్భంగా పండ్ల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. సాధారణ రోజుల్లో రూ.20లకు లభించే పుచ్చకాయ రూ.40 నుంచి రూ.120 వరకు ధర పలుకుతోంది. రూ.30లకు లభించే డజన్ అరటి పండ్లు నేడు రూ.45 నుంచి రూ.60లకు చేరాయి. ద్రాక్ష గతంలో కిలో రూ.50 ఉండగా ప్రస్తుతం రూ.70 నుంచి రూ.100కు చేరాయి. గతంలో రూ.10లకు నాలుగు బత్తాయి పండ్లు వస్తే ప్రస్తుతం ఒకదానికి రూ.5లకు విక్రయిస్తున్నారు. మొరంగడ్డ కిలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.60లకు చేరింది. ఇలా... అన్ని రకాల పండ్లకు రెక్కలొచ్చాయి. పండుగ కావడంతో ఎలాగైనా కొనుగోలు చేస్తారని అమ్మకందారులు రేట్లు పెంచారని పలువురు అంటున్నారు. ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి మరీ పండ్లను విక్రయిస్తున్నారు.
(ఘట్‌కేసర్)