breaking news
fruits rates
-
ఇప్పుడు ఆపిల్, ఆరెంజ్‌ల వంతు!
దేశంలో అకస్మాత్తుగా గోధుమల ధరలకు రెక్కలు వచ్చాయ్. వెంటనే రంగంలోకి ఈసారి వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటం, హీట్ వేవ్ కారణంగా గోధుమల దిగుబడి తగ్గిపోయిందంటూ వివరణ ఇచ్చింది. ఎగుమతులపై ఆంక్షలు విధించింది. కానీ గోధుమల ధరలైతే పెద్దగా తగ్గుముఖం పట్టిన దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడు గోధుమల తరహాలోనే హీట్‌వేవ్ ప్రభావానికి మరో పంటలు లోనయ్యాయి. హీట్‌వేవ్ కారణంగా మహారాష్ట్రలో కమల పండ్లు (ఆరెంజ్), హిమాచల్ ప్రదేశ్‌లో ఆపిల్ పంటల దిగుబడి తగ్గిపోయిందనే వార్తలు వస్తున్నాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం గతేడాది దిగుబడితో పోల్చితే హిమాచల్ ఆపిల్ దిగుబడి 25 శాతం, మహారాష్ట్రలోని విదర్భ ఏరియాలో ఎక్కువగా పండే ఆరెంజ్ దిగుబడి 25 నుంచి 30 శాతం వరకు పడిపోయినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఆరెంజ్, యాపిల్ పండ్లకు సీజన్‌తో సంబంధం లేకుండా డిమాండ్ ఉంటుంది. అందరి ఇళ్లలో సాధారణంగా లభించే ఫలాల జాబితాలో ఇవి రెండు ఉంటాయి. దాదాపు నాలుగో వంతు వరకు దిగుబడి తగ్గిపోయిన దరిమిలా ఈ రెండు ఫలాల ధరలకు కూడా పెరగవచ్చంటూ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలకు ఆర్బీఐ ఉపక్రమించినా.. మరో రూపంలో కొత్త సమస్య వచ్చి పడుతూనే ఉన్నాయి. ధరల పెరుగుదులకు దోహదం చేస్తున్నాయి. చదవండి: బిల్‌గేట్స్ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా? -
ఆకాశాన్నంటిన పండ్ల ధరలు
రంగారెడ్డి: శివరాత్రి పండుగ సందర్భంగా పండ్ల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. సాధారణ రోజుల్లో రూ.20లకు లభించే పుచ్చకాయ రూ.40 నుంచి రూ.120 వరకు ధర పలుకుతోంది. రూ.30లకు లభించే డజన్ అరటి పండ్లు నేడు రూ.45 నుంచి రూ.60లకు చేరాయి. ద్రాక్ష గతంలో కిలో రూ.50 ఉండగా ప్రస్తుతం రూ.70 నుంచి రూ.100కు చేరాయి. గతంలో రూ.10లకు నాలుగు బత్తాయి పండ్లు వస్తే ప్రస్తుతం ఒకదానికి రూ.5లకు విక్రయిస్తున్నారు. మొరంగడ్డ కిలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.60లకు చేరింది. ఇలా... అన్ని రకాల పండ్లకు రెక్కలొచ్చాయి. పండుగ కావడంతో ఎలాగైనా కొనుగోలు చేస్తారని అమ్మకందారులు రేట్లు పెంచారని పలువురు అంటున్నారు. ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి మరీ పండ్లను విక్రయిస్తున్నారు. (ఘట్కేసర్)