నవ తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేయాలి | foundation for the construction of the nava telangana | Sakshi
Sakshi News home page

నవ తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేయాలి

Apr 4 2014 4:30 AM | Updated on Sep 2 2017 5:32 AM

నవ తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేయాలి

నవ తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి, నవ తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

కథలాపూర్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి, నవ తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. గురువారం రాత్రి ఆమె మండలంలోని తక్కళ్లపల్లిలో టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి తుల ఉమకు మద్దతుగా ప్రచారం చేశారు.
 
ఈ సందర్భం గా గ్రామంలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. అందుకే స్థా నిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి బలం పెంచాలన్నారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సొంత జిల్లాలోనే యువతకు ఉపాధి చూపించలేకపోయారని, జిల్లా లో పరిశ్రమలు నెలకొల్పితే ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయనే ధ్యాస కూడా ఆయనకు లేకుండాపోయిందని విమర్శించారు.
 
టీఆర్‌ఎస్ అధికారం లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో  రైతులు పండించిన పం టలకు మద్దతు ధర కల్పించి బోనస్ ఇస్తామన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రమేశ్‌బాబు, విద్యాసాగర్‌రావు, కథలాపూర్ జెడ్పీటీసీ అ భ్యర్థి తుల ఉమ, నాయకులు లోక బాపురెడ్డి, నాగం భూమయ్య, కల్లెడ శంకర్, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement