ప్రజల చూపు..  మోదీ వైపు: కె.లక్ష్మణ్‌ | Developed by Modi Sarkar Across the country | Sakshi
Sakshi News home page

ప్రజల చూపు.. మోదీ వైపు: కె.లక్ష్మణ్‌

Feb 10 2019 3:14 AM | Updated on Mar 9 2019 3:59 PM

Developed by Modi Sarkar Across the country - Sakshi

పోచారం: దేశవ్యాప్తంగా మోదీ సర్కార్‌ అందించిన అభివృద్ధి ఫలాలు, పేదలు, రైతులు, అసం ఘటిత కార్మికుల కోసం తీసుకున్న నిర్ణయాల ప్రభావంతో ప్రజలు మోదీ వైపే మొగ్గుచూపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ అన్నారు. శనివారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని అన్నోజిగూడ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో ‘అబ్‌కీ బార్‌– ఫిర్‌ మోదీ సర్కార్‌’ పేరుతో లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కార్యాచరణ కమిటీలు వేశామన్నారు. ఈ కమిటీలకు నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్ణయించడం జరిగిందన్నారు.

మోదీ సర్కార్‌ అందించిన అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. గెలుపే లక్ష్యంగా కమిటీలు పనిచేయాలని కోరారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 55 నెలల్లో మోదీ చేసిన అభివృద్ధి 55 ఏళ్లు పాలించి న ఇతర పార్టీలు చేయలేకపోయాయని ఎద్దేవా చేశారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆయు ష్మాన్‌ భారత్‌ కింద 5 లక్షల రూపాయల ఉచిత బీమా పథకం, అగ్రవర్ణాల పేదల కోసం ప్రవే శపెట్టిన 10 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, బాబూమోహన్, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement