తేలికపాటి యుద్ధ విమానాల్లో (ఎల్‌సీఏ) మొదటిదైన తేజస్ విజయవంతంగా గగన వీధుల్లో ప్రయాణించిందని హెచ్‌ఏఎల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : తేలికపాటి యుద్ధ విమానాల్లో (ఎల్‌సీఏ) మొదటిదైన తేజస్ విజయవంతంగా గగన వీధుల్లో ప్రయాణించిందని హెచ్‌ఏఎల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్‌ఏఎల్ చీఫ్ టెస్ట్ ఫ్లైయింగ్ కేఏ. ముతన మంగళవారం సాయంత్రం తొలిసారిగా దీనిని నడిపారని పేర్కొం ది. గత ఏడాది డిసెంబరులో తేజస్‌కు ఐఓసీ సర్టిఫికేషన్ లభించిందని, తొమ్మిది నెలల్లో మరో మైలురాయిని అధిగమించామని హెచ్‌ఏఎల్ చైర్మన్ డాక్టర్ ఆర్‌కే. త్యాగి తెలిపారు.
భారతీయ వైమానిక దళం కార్యకలాపాలకు ఇక తేజస్ సిద్ధమైనట్లేనని వెల్లడించారు. ఇతర శ్రేణుల్లోని ఎయిర్‌క్రాఫ్ట్ వివిధ నిర్మాణ దశల్లో ఉందని తెలిపారు. ఎల్‌సీఏ తయారీలో హెచ్‌ఏఎల్ అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొందని, కార్బన్ ఫైబర్ దిగుమతిలో అమెరికా ఆంక్షలకు గురైందని ఆయన గుర్తు చేశారు.