
కన్నులపండువగా శ్రీవారి ధ్వజారోహణం
తిరుమలలో శ్రీవారి బ్రహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. శ్రీ వారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 11 వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
