జల్లికట్టు.. పోలీసుపై ఎద్దు దాడి | Bull Attacks Policeman In Jallikattu At Vellore | Sakshi
Sakshi News home page

జల్లికట్టు.. పోలీసుపై ఎద్దు దాడి

Jan 19 2020 3:47 PM | Updated on Jan 19 2020 6:06 PM

Bull Attacks Policeman In Jallikattu At Vellore - Sakshi

వెల్లూరు : సంక్రాంతి సంబరాల్లో భాగంగా తమిళనాట జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో కొన్ని చోట్ల అపశ్రుతులు చోటుచేసుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఎద్దులు పొడవడంతో ఇప్పటికే నలుగురు మృతిచెందగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. అయితే వెల్లురులో మాత్రం జల్లికట్టు పోటీ జరిగే చోట విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారిపైకి ఎద్దు దూసుకోచ్చింది. అక్కడ జనాలను అదుపుచేస్తున్న పోలీసును వెనకనుంచి దూసుకొచ్చిన ఎద్దు ఢీకొట్టింది. కొమ్ములతో పైకి లేపడంతో.. ఆ పోలీసు కొద్ది దూరంలో ఎగిరిపడ్డాడు.

ఈ ఘటనలో పోలీసుతో పాటుమరికొంతమంది ప్రజలు కూడా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరిలించారు. జల్లికట్టు పోటీల కోసం 200 ఎద్దులను ఒకచోట చేర్చడంతో వాటిని అదుపు చేయడం కష్టంగా మారినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆవేశంగా బయటకు దూసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్‌ అధికారిని ఎద్దు ఢీ కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement