breaking news
bull attacks
-
జల్లికట్టు.. పోలీసుపై ఎద్దు దాడి
వెల్లూరు : సంక్రాంతి సంబరాల్లో భాగంగా తమిళనాట జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో కొన్ని చోట్ల అపశ్రుతులు చోటుచేసుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఎద్దులు పొడవడంతో ఇప్పటికే నలుగురు మృతిచెందగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. అయితే వెల్లురులో మాత్రం జల్లికట్టు పోటీ జరిగే చోట విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారిపైకి ఎద్దు దూసుకోచ్చింది. అక్కడ జనాలను అదుపుచేస్తున్న పోలీసును వెనకనుంచి దూసుకొచ్చిన ఎద్దు ఢీకొట్టింది. కొమ్ములతో పైకి లేపడంతో.. ఆ పోలీసు కొద్ది దూరంలో ఎగిరిపడ్డాడు. ఈ ఘటనలో పోలీసుతో పాటుమరికొంతమంది ప్రజలు కూడా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరిలించారు. జల్లికట్టు పోటీల కోసం 200 ఎద్దులను ఒకచోట చేర్చడంతో వాటిని అదుపు చేయడం కష్టంగా మారినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆవేశంగా బయటకు దూసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్ అధికారిని ఎద్దు ఢీ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
దారంటా వెళుతున్న వ్యక్తులను ఎద్దు కుమ్మేసింది
-
వృద్ధురాలిపై ఎద్దు దాడి
విజయనగరం : పార్వతీపురం మున్సిపాలిటీ ఆఫీసు సమీపంలో ఓ వృద్ధురాలిని దేవర ఎద్దు పొడిచింది. ఎద్దు పొడవటంతో వృద్దురాలి పొట్ట నుంచి పేగులు బయటకు వచ్చాయి. స్థానికులు ఆమెను హుటాహుటిన పార్వతీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వృద్ధురాలికు సంబంధించిన చెందిన వివరాలు తెలియాల్సి ఉంది.