బీఎస్పీ ఎమ్మెల్యే భార్య హత్య | BSP MLA Haji Aleem's wife, Rehana, murdered in Delhi | Sakshi
Sakshi News home page

బీఎస్పీ ఎమ్మెల్యే భార్య హత్య

Oct 10 2013 2:47 AM | Updated on Sep 1 2017 11:29 PM

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ బీఎస్పీ ఎమ్మెల్యే హాజీ అలీం భార్య రెహానా(40) దారుణ హత్యకు గురయ్యారు. ఈశాన్య ఢిల్లీ న్యూ జఫ్రాబాద్‌లోని సొంతింట్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ బీఎస్పీ ఎమ్మెల్యే హాజీ అలీం భార్య రెహానా(40) దారుణ హత్యకు గురయ్యారు. ఈశాన్య ఢిల్లీ న్యూ జఫ్రాబాద్‌లోని సొంతింట్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఆమె ఛాతీలో ఐదు కత్తిపోట్లు, తూటా గాయం కనిపించాయి. పనిమనిషి ఉదయం రెహానా ఇంటికెళ్లగా నెత్తుటి మడుగులో ఆమె మృతదేహం కనిపించింది. 
 
 ఆ వెంటనే ఆమె పోలీసులకు సమాచారమందించడంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అలీమ్ ప్రస్తుతం హజ్ యాత్రలో ఉన్నారు. రెహానా ఆయన రెండో భార్య అని, ఇంట్లో ఒంటరిగా నివసిస్తోందని పోలీసులు చెప్పారు. ఇంట్లో దోపిడీ జరిగినట్లు తప్పుదారి పట్టించడానికి దుండగులు వస్తువులను చిందరవందర చేశారని తెలిపారు. తెలిసిన వ్యక్తులెవరో ఇంట్లోకి వచ్చినట్లు ఆధారాలు లభించాయన్నారు.  
 
 వ్యక్తిగత, రాజకీయ కక్ష్యలతోనే రెహానాను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, అలీమ్, ఆయన సోదరుడిపై ఓ అత్యాచార కేసులో నాన్ బెయిలబుల్ వారంటు ఉంది. సర్కస్ కంపెనీ నడుపుతున్న వీరు సర్కస్‌లో బాలకార్మికులను పెట్టుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement