మంధానకు షాక్‌.. మిథాలీ సేనదే విజయం

Womens T20 Challenge Velocity won by 3 Wickets Against Trailblazers - Sakshi

జైపూర్‌: తొలి మ్యాచ్‌ విజయంతో జోరుమీదున్న ట్రయల్‌ బ్లేజర్స్‌కు వెలాసిటీ అదిరిపోయే పంచ్‌ ఇచ్చింది. ఐపీఎల్‌ మహిళల టి20 చాలెంజ్‌లో భాగంగా బుధవారం ట్రయల్‌ బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో వెలాసిటీ విజయం సాధించింది. బ్లేజర్స్‌ నిర్దేశించిన 113 పరుగుల స్వల్స లక్ష్యాన్ని ఛేదించడానికి మిథాలీ సేన ఆపసోపాలు పడింది. అయితే షేఫాలీ వర్మ(34; 31 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్‌), వ్యాట్‌(46; 35 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లు)లు పట్టుదలతో రాణించడంతో వెలాసిటీ పని సులువైంది. వీరిద్దరూ ఔటైన తర్వాత వెలాసిటీ వికెట్ల పతనం వేగంగా సాగింది. చివర్లో మిథాలీ రాజ్‌(17) రాణించడంతో వెలాసిటీ మరో రెండు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీప్తి శర్మ నాలుగు వికెట్లతో అదరగొట్టగా, గైక్వాడ్‌, డియోల్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్‌ బ్లేజర్స్‌కు శుభారంభం దక్కలేదు. స్మృతి మంధాన (10) జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఔటైంది. ఈక్రమంలో హర్లీన్‌ డియోల్‌ (43; 40 బంతుల్లో 5×4), సుజీ బేట్స్‌ (26; 22 బంతుల్లో 2×4, 1×6) నిలకడగా ఆడారు. దీప్తి శర్మ (16) ఫర్వాలేదనిపించింది. ఏక్తా బిస్త్‌, అమెలియా కెర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక మహిళల ఐపీఎల్‌లో భాగంగా రేపు(గురువారం) సూపర్‌ నోవాస్‌తో వెలాసిటీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ వెలాసిటీ గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిపోతే నెట్‌ రన్‌రేట్‌ కీలకంగా మారే అవకాశం ఉంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top