సైనాతో పోరుకు సిద్ధం: పి.వి.సింధు | Ready to take on Saina nehwal in IBL: P.V.Sindhu | Sakshi
Sakshi News home page

సైనాతో పోరుకు సిద్ధం: పి.వి.సింధు

Aug 11 2013 8:54 PM | Updated on Sep 1 2017 9:47 PM

సైనాతో పోరుకు సిద్ధం: పి.వి.సింధు

సైనాతో పోరుకు సిద్ధం: పి.వి.సింధు

భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్‌తో పోరుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన పి.వి.సింధు తెలిపింది.

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్‌తో పోరుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన  పి.వి.సింధు తెలిపింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్)లో సైనాతో తలపడటానికి మరింత ఆసక్తి కనబరుస్తున్నట్లు సింధు తెలిపింది. ఈ నెల 14 నుంచి ఐబీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే.
 
 ఆగస్టు 15వ తేదీన తమ మధ్య జరిగే మ్యాచ్‌లో సైనాను నిలువరించటానికి ప్రయత్నిస్తానని సింధు సవాల్ విసిరింది. ఐబీఎల్ లో రసవత్తర పోరు సాగడం ఖాయమని, అత్యుత్తమ క్రీడాకారిణులతో తలపడేందుకు ఎదురుచూస్తున్నానని సింధు తెలిపింది. అవాధీ జట్టుకు ఐకాన్ ప్లేయర్‌గా సింధు, హాట్ షాట్‌ ఐకాన్ ప్లేయర్‌గా సైనాలు బరిలోకి దిగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement