పాక్‌ మీకు కావాల్సిన కప్‌ ఇదే: పూనమ్‌ ఫైర్‌

Poonam Pandey Wants to Give Pakistan a Different Kind of Cup - Sakshi

ముంబై : పాకిస్తాన్‌ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను అవమానిస్తూ పాక్‌ మీడియా రూపొందించిన యాడ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగే భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ నేపథ్యంలో రూపొందించిన ఈ యాడ్‌ ఇరు దేశాల మధ్య ఉన్న విద్వేషాన్ని మరింత రెచ్చగొట్టింది. ఇప్పటికే ఈ యాడ్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. భారత టెన్నిస్‌ స్టార్‌, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ సతీమణి సానియా మీర్జా సైతం మండిపడింది. మతిలేని ప్రకటనలతో మితిమీరిన ప్రచారం అక్కర్లేదని చివాట్లుపెట్టింది.

ఇక తాజాగా బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే ఈ యాడ్‌పై తీవ్రంగా మండిపడింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. ‘నిన్ననే నా వాట్సాప్‌లో పాకిస్తాన్‌కు సంబంధించిన ఈ యాడ్‌ను చూశాను. ఓ హీరో చేసిన పనిని వారు అపహాస్యం చేశారు. పాకిస్తాన్‌ ఇది మంచిది కాదు. ఈ యాడ్‌పై నా సమాధానం ఏంటంటే? టీ కప్పులపై సెటైర్లు ఎందుకు. వాస్తవానికి మీకు కావాల్సింది. ఈ కప్‌( తన లోదుస్తులు చూపిస్తూ) డబుల్‌ కప్‌’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఇక పూనమ్‌ చర్యపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆమె చేసిన పనిని మెచ్చుకోగా మరికొందరు తప్పుబడుతున్నారు. (వైరల్‌ : కప్పు లాక్కెళ్లిపోయిన పాకిస్తాన్‌..!)

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ దాదాపు 60 గంటల పాటు పాకిస్తాన్‌ ఆర్మీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. గన్‌స్లింగర్‌ మీసంతో ఉండే అభినందన్‌ ఆహార్యం అందరికీ సుపరిచితమే. అయితే అతని ఆహర్యంతో ఉన్న వ్యక్తితో భారత వ్యూహాలపై వ్యంగ్యమైన ప్రకటన పాక్‌కు చెందిన జాజ్‌ టీవీ చానెల్‌ రూపొందించింది. ఆ యాడ్‌లో పాక్‌ వర్గాలు మీ ఎత్తుగడలేంటని అడిగితే ఆ వ్యక్తి ‘క్షమించాలి. నేను ఆ విషయాలు చెప్పదల్చుకోలేదు’ అని ముందుకు కదలగా అతని చేతిలోని టీకప్పును లాక్కుంటారు. ఈ యాడ్‌ ప్రతి భారతీయుడికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇక భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ చరిత్రలో పాక్‌పై భారత్‌ ఓడి సందర్భాలు లేవు. ప్రస్తుత జట్ల బలబలగాలను గమనిస్తే పాక్‌ కన్నా భారత జట్టే అభేద్యంగా కనిపిస్తోంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top