రాజస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ చెత్త రికార్డు | Jofra Archer Three Ducks in Debut IPL Season | Sakshi
Sakshi News home page

May 19 2018 5:13 PM | Updated on May 19 2018 5:15 PM

Jofra Archer Three Ducks in Debut IPL Season - Sakshi

జోఫ్రా ఆర్చర్‌

జైపూర్‌ : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వెస్టిండీస్‌ యువ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ మూడు సార్లు డకౌట్‌ కాగా.. ఇందులో రెండు గోల్డెన్‌ డక్‌లుండటం విశేషం. దీంతో అరంగేట్ర సీజన్‌లో ఇలా మూడు సార్లు డకౌట్‌ అయిన ఆటగాళ్ల సరసన ఆర్చర్‌ చేరాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఇలా విన్సెంట్‌ (2011), రామ్‌పాల్‌(2013), గ్రాండ్‌హోమ్‌(2017)లు ఈ అప్రతిష్ట్రను మూటగట్టుకోగా తాజాగా ఆర్చర్‌ ఈ సీజన్‌లో ఈ చెత్త రికార్డును నమోదు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement