క్రికెటర్ అమిత్ మిశ్రాపై లైంగిక వేధింపుల కేసు | case filed against amith mishra in bangalore | Sakshi
Sakshi News home page

క్రికెటర్ అమిత్ మిశ్రాపై లైంగిక వేధింపుల కేసు

Oct 20 2015 8:08 PM | Updated on Jul 23 2018 9:13 PM

క్రికెటర్ అమిత్ మిశ్రాపై లైంగిక వేధింపుల కేసు - Sakshi

క్రికెటర్ అమిత్ మిశ్రాపై లైంగిక వేధింపుల కేసు

భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. మిశ్రా తనను లైంగికంగా వేధించినట్టు ఓ మహిళ ఆరోపించింది.

బెంగళూరు: భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. మిశ్రా తనను లైంగికంగా వేధించినట్టు ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు  చేసిన బెంగళూరు పోలీసులు.. విచారణకు హాజరు కావాల్సిందిగా మంగళవారం మిశ్రాకు సమన్లు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.

గత సెప్టెంబర్లో బెంగళూరులోని ఓ హోటల్లో బస చేసిన అమిత్ మిశ్రాను చూసేందుకు వెళ్లిన తనను లైంగిక వేధించాడని ఓ మహిళ బెంగళూరు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బెంగళూరు సెంట్రల్ డీసీపీ సందీప్ పాటిల్ ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద మిశ్రాపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గత నెలలో శిక్షణ కోసం మిశ్రా బెంగళూరుకు వచ్చినట్టు చెప్పారు. సమన్లకు స్పందించకుంటే మిశ్రాపై కఠిన చర్యలు తీసుకుంటామని సందీప్ పాటిల్ తెలిపారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్లో భారత జట్టుకు అమిత్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement