ఉపుల్ తరంగ (115; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి తోడు చండిమాల్ (50; 4 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో శ్రీలంక జట్టు
గాలె: ఉపుల్ తరంగ (115; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి తోడు చండిమాల్ (50; 4 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో శ్రీలంక జట్టు బంగ్లాదేశ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. శుక్రవారం నాలుగో రోజు ఆటలో లంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 69 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది.
వెలుతురు మందగించడంతో ఆటను ముందుగానే ముగించగా... ప్రస్తుతం క్రీజులో ఓపెనర్లు సౌమ్య సర్కార్ (53 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్), తమీమ్ ఇక్బాల్ (13 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు. చివరి రోజు శనివారం విజయానికి మరో 390 పరుగులు చేయాల్సి ఉండగా బంగ్లా చేతిలో పది వికెట్లున్నాయి.