breaking news
Upul tarnga
-
బంగ్లాదేశ్ లక్ష్యం 457
గాలె: ఉపుల్ తరంగ (115; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి తోడు చండిమాల్ (50; 4 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో శ్రీలంక జట్టు బంగ్లాదేశ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. శుక్రవారం నాలుగో రోజు ఆటలో లంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 69 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. వెలుతురు మందగించడంతో ఆటను ముందుగానే ముగించగా... ప్రస్తుతం క్రీజులో ఓపెనర్లు సౌమ్య సర్కార్ (53 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్), తమీమ్ ఇక్బాల్ (13 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు. చివరి రోజు శనివారం విజయానికి మరో 390 పరుగులు చేయాల్సి ఉండగా బంగ్లా చేతిలో పది వికెట్లున్నాయి. -
దక్షిణాఫ్రికా జోరు
సెంచరీతో చెలరేగిన డు ప్లెసిస్ పోరాడి ఓడిన శ్రీలంక కేప్‌టౌన్: డు ప్లెసిస్ (141 బంతుల్లో 185; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరవిహారం చేయడంతో.... శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలోనూ దక్షిణాఫ్రికానే విజయం వరించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 40 పరుగుల ఆధిక్యంతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోరు చేసింది. డు ప్లెసిస్ సెంచరీతో అదరగొట్టగా... కెప్టెన్ డివిలియర్స్ (64; 4 ఫోర్లు), డి కాక్ (55; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.1 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్ ఉపుల్ తరంగ (119; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ఓ దశలో 307/5 పరుగులతో గెలిచే స్థితిలో నిలిచిన లంక... చివర్లో అనూహ్యంగా కుప్పకూలింది. 20 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది.