అందుకే వైఎస్‌ రాజారెడ్డిని హత్య చేశారు | YSRCP Leader Sudhakar Babu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘3 తరాలుగా వైఎస్‌ కుటుంబంపై ఆయన కక్షకట్టారు’

Mar 17 2019 2:38 PM | Updated on Mar 17 2019 4:14 PM

YSRCP Leader Sudhakar Babu Fires On Chandrababu - Sakshi

3 తరాలుగా వైఎస్సార్‌ కుటుంబంపై ఆయన కక్షకట్టారని...

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌ బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్ర అంతా రక్తసిక్తం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ వైఎస్సార్‌ కుటుంబంపై కుట్రలకు తెరతీశారని ఆరోపించారు. 1998లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డిని దెబ్బతీసేందుకే వైఎస్‌ రాజారెడ్డిని హత్య చేశారన్నారు. 3 తరాలుగా వైఎస్సార్‌ కుటుంబంపై చంద్రబాబు కక్షకట్టారని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారన్న భయంతో మానసికంగా దెబ్బ తీసేందుకే వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేయించారని ఆరోపించారు.

ఎన్నికల్లో ప్రజల్లోకి ఎలా వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో బాబు ఉన్నారన్నారు. చంద్రబాబు ఎంత భయపెట్టినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. టీడీపీలో దళితులపై జరిగిన దాడులు హర్షకుమార్‌కు గుర్తులేవా అని ప్రశ్నించారు. సామాన్య కార్యకర్తలు, దళితులకు వైఎస్సార్‌ సీపీ సీట్లు కేటాయించిందని తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను బీసీ, ఎస్సీ నేతలతో వైఎస్‌ జగన్‌ ప్రకటింపజేశారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement