గాల్లో ప్రయాణం.. క్షణాల్లో ప్రచారం

Political Leaders Use Flights And Helicopters in Lok Sabha Election - Sakshi

ఎన్నికల వేళ హెలికాప్టర్లు, విమానాలకు భలే గిరాకీ

గతంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు రాజకీయ నాయకులు కార్లు, బస్సులు వాడేవారు. ఊళ్లలో అయితే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల వంటిని ఉపయోగించేవారు. ఇప్పుడంతా  స్పీడ్‌.. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేయాలి. దాంతో ప్రచారానికి హెలికాప్టర్లు, చిన్న విమానాలు వాడుతున్నారు. వీటి వల్ల ఖర్చు ఎక్కువైనా తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రాంతాలను చుట్టేయొచ్చు. రోడ్డు సౌకర్యం లేని శివారు ప్రాంతాలకు కూడా వెళ్లి ప్రచారం చేయొచ్చు. ఈ ఉద్దేశంతోనే ప్రధాన పార్టీల నేతలంతా అందుబాటులో ఉన్న హెలికాప్టర్లు, చిన్న విమానాలను బుక్‌ చేసేసుకున్నారు.మే మూడో వారం వరకు..

దేశంలో ప్రస్తుతం 250 వరకు రిజిస్టరయిన హెలికాప్ట ర్లు ఉన్నాయని రోటరీ వింగ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా పశ్చిమ విభాగం అధ్యక్షుడు కెప్టెన్‌ ఉదయ్‌ గెల్లి చెబు తున్నారు. వీటిలో హెలికాప్టర్‌ కంపెనీల దగ్గర 75 వరకు ఉన్నాయి. అవన్నీ ముందుగానే బుక్‌ అయిపోయాయి. చిన్నపాటి విమానాల్లో ఒక ఇంజిన్, రెండు ఇంజిన్లు, అంతకంటే ఎక్కువ ఇంజిన్లు ఉన్నవి ఉన్నాయి. పైలట్‌తో పాటు ఆరుగురు ప్రయాణించే కింగ్‌ఎయిర్‌ సీ90, ఇద్దరు పైలట్లు, 8 మంది ప్రయాణించగల కింగ్‌ ఎయిర్‌ బీ200 వంటి విమానాలు దేశంలో డజను వరకు ఉన్నాయని ముంబైకి చెందిన విమానయాన నిపుణుడు ప్రదీప్‌ చెప్పారు. వీటికిప్పుడు డిమాండు బాగా ఉందని, మే మూడో వారం వరకు ఇవన్నీ ముందే బుక్‌ అయిపోయాయని చెప్పారు.

గంటల్లో కాంట్రాక్టు.. లక్షల్లో అద్దె
దేశంలో అందుబాటులో ఉన్న హెలికాప్టర్లు, చిన్న విమానాల్లో 50 శాతం బీజేపీయే బుక్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. చాలా పార్టీలు 45–60 రోజుల కోసం వీటిని అద్దెకు తీసుకున్నాయని గెల్లి చెప్పారు. రకాన్ని బట్టి వీటి అద్దె గంటకు 75 వేల నుంచి మూడున్నర లక్షల వరకు ఉంటుంది. వీటిని రోజూ కనీసం 3 గంటల పాటు బుక్‌ చేసుకోవాలి. అన్ని గం టలు తిరిగినా తిరగకున్నా అద్దె మాత్రం చెల్లించాలి. గరిష్టంగా అరగంటలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. 

ఎన్నికల సంఘం నిబంధనలు
హెలికాప్టర్లు, విమానాలను ఎన్నికల ప్రచారానికి వాడే విషయంలో ఎన్నికల సంఘం కొన్ని నిబంధన లు పెట్టింది. ప్రధాని మినహా మిగతా వారెవరూ ప్రభుత్వ హెలికాప్టర్‌/ విమానాలను వాడరా దు. హెలికాప్టర్ల అద్దె, రాకపోకల లెక్కలు పక్కా ఉండాలి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top