ఏమిటీ తిట్ల దండకం?: దాసోజు శ్రవణ్‌

Dasoju sravan comments over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ తన ఎన్నికల ప్రచారంలో నాలుగున్నరేళ్ల పాలన గురించి చెప్పకుండా పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తిట్ల దండకానికి దిగడం ఏమిటని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ నిలదీశారు. సోమవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరో అధికార ప్రతినిధి కిశాంక్‌ కలసి ఆయన మాట్లాడారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారంటూ దేశ తొలి ప్రధాని నెహ్రూపై కేసీఆర్‌ విమర్శలు గుప్పించారని, తద్వారా తెలం గాణ సెంటిమెంటును రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

‘పరిస్థితులనుబట్టి ఆంధ్ర, తెలంగాణను కలిపాం.. ఒకవేళ రెండు రాష్ట్రాల ప్రజలకు పొసగకపోతే విడిపోవచ్చు’ అని నె్రçహూ స్పష్టం చేశారని దాసోజు గుర్తుచేశా రు. అలాగే దివంగత సీఎం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిని దూషించడాన్ని కూడా తప్పుబట్టారు. రాష్ట్ర అసెంబ్లీ రద్దు అనంతరం టీఆర్‌ఎస్‌ అధోగతి పాలవుతుందని గ్రహించి కేసీఆర్‌ అడ్డగోలుగా కాంగ్రెస్‌ నేతలపై మాటల దాడి చేస్తున్నారన్నా రు. ప్రజలకు హామీలివ్వడం, ఆ తర్వాత మాట మార్చడంలో కేసీఆర్‌ సిద్ధహస్తుడన్నారు. అపరి చితుడు, గజనీ చిత్రాల్లో పాత్రధారుల తరహాలో పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top