సింగపూర్‌లో వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశం

YSRCP NRI Wing Conducts party members get together in Singapore - Sakshi

సింగపూర్ : సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బనగానపల్లె మాజీ శాసన సభ్యులు కాటసాని రామి రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా సహకార బ్యాంక్ మాజీ ఛైర్మన్ గుండం సూర్య ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువత కార్యదర్శి పోచ శీల రెడ్డిలు పాల్గొన్నారు. 


కాటసాని రామి రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక యుద్ధం లాంటిదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా..పేదల జీవితాల్లో అలనాటి 'రాజన్న' పాలన వెలుగులు చూడాలన్నా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వేల సింగపూర్‌లో ఉండే ఎన్నారై కార్యకర్తలు చేయవలసిన కార్యక్రమాల మీద విధి విధానాలను వివరించారు. సింగపూర్ లో పార్టీ ఎన్నారై శాఖ చేస్తున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఎన్నికల సమయంలో కచ్చితంగా తమ సొంత స్థలాలకి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంత ఆవశ్యకమో ప్రజలకు ఎలా వివరించాలో చెప్పారు. ఇలాంటి సమావేశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నివసిస్తున్న ప్రతి దేశంలో జరగాలని, అక్కడ నివసించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై శాఖను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపు సూచించారు. 

జై జగనన్న..జోహార్ రాజన్న.. జిందాబాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నినాదాలతో సమావేశంలో అభిమానులు హోరెత్తించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు..ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తెలుగు వారందరికీ సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం అభినందనలు తెలిపింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top