రాజీవ్ హంతకులకు సుప్రీంలో చుక్కెదురు | SC says Tamil Nadu Govt cannot release Former PM Rajiv Gandhi's killers without consent from centre | Sakshi
Sakshi News home page

రాజీవ్ హంతకులకు సుప్రీంలో చుక్కెదురు

Dec 2 2015 11:00 AM | Updated on Sep 2 2018 5:24 PM

రాజీవ్ హంతకులకు సుప్రీంలో చుక్కెదురు - Sakshi

రాజీవ్ హంతకులకు సుప్రీంలో చుక్కెదురు

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది.

న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు  బుధవారం  స్టే విధించింది.  కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే వారి విడుదలపై  నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ వారిని విడుదల చేయరాదని న్యాయస్థానం ఆదేశించింది. రాజీవ్ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని  కోరింది. తమకు విధించిన శిక్షను మాఫీ చేయాలంటూ వాళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
 
రాజీవ్‌గాంధీ హంతకుల మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు  వెలువరించినా ఈ వివాదం నడుస్తోంది. గతంలో వారిని విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నపుడు యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజీవ్ గాంధీ హత్య అనేది భారతదేశం మీద జరిగిన దాడి అని, ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయొద్దని కోరింది. ఆ సందర్భంగా కూడా  సుప్రీం ఇదేలా స్పందిస్తూ దోషుల విడుదలపై స్టే విధించింది.  
 
మరోవైపు రాజీవ్ హత్యకేసులో దోషులు నళిని, మురుగన్ల కుమార్తె హరిత్ర రాహుల్ గాంధీని క్షమాపణ కోరింది. చేసిన నేరానికి తన తల్లిదండ్రులు శిక్ష అనుభవించటంతో పాటు, పశ్చాత్తాపం చెందారని, వారిని క్షమించి వదిలేయాలని విజ్ఞప్తి  చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement