
సాక్షి, న్యూ ఢిల్లీ : ఫొని తుఫానుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను నష్ట నివారణ చర్యలు, ముందు జాగ్రత్త చర్యలపై గురువారం ఉన్నాతాధికారులతో సమీక్ష జరిపారాయన. ప్రధాని సమీక్షాసమావేశానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఫొని తుఫాను గమనంపై ఐఎండీ డైరక్టర్ జనరల్ వివరించగా.. తీసుకోనున్న ముందు జాగ్రత్త చర్యల గురించి ఎన్డీఆర్‌ఎఫ్ చీఫ్ వివరించారు.
తుఫాను ప్రభావిత రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని ప్రధానమంత్రి అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన అన్ని సహాయ పునరావాస చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.