అలాచేసినందుకు రేషన్‌ కట్‌..

Panchayat Body Denies Ration to 20 Odisha Families for Defecating in Open - Sakshi

బరంపూర్‌: బహిరంగ మల విసర్జన చేస్తున్న కుటుంబాలకు రేషన్‌ సరుకులను నిలిపివేస్తూ ఒరిస్సాలోని గంజాం జిల్లా శనఖే ముండి బ్లాక్‌లోని గౌతమీ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేసే వారికి రేషన్‌ ఇవ్వరాదని నిర్ణయించామని, ఆ మేరకు 20 కుటుంబాల వారికి రేషన్‌ ఇవ్వడం లేదని సర్పంచ్‌ సుశాంత్‌ స్వైన్‌ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 300 మంది మహిళలు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పంచాయతీలోని బహిరంగ ప్రదేశాలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో బహిరంగ మలవిసర్జన అలవాటు తగ్గుముఖం పట్టిందన్నారు. కాగా, ఆహార భద్రత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అనీ ఆయా కుటుంబాలకు రేషన్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గంజాం కలెక్టర్‌  తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top