వారసత్వ రాజకీయాలు సరికాదు


ఒకేసారి ఎన్నికలు అవసరం: ఉపరాష్ట్రపతి వెంకయ్య

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలు ఆమోదనీయం కావని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారత్‌లో వారసత్వ పాలన సాధ్యమేనని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య పరోక్షంగా స్పందించారు. ‘వారసత్వంపై చర్చ జరుగుతోంది. వారసత్వం, ప్రజాస్వామ్యం కలిసి ముందుకెళ్లలేవు. అది మన వ్యవస్థను బలహీనపరుస్తుంది. అందుకే ప్రజాస్వామ్యంలో వారసత్వం ఆమోదనీయం కాదు’ అని ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య పేర్కొన్నారు. అయితే, తన వ్యాఖ్యలు ఏ పార్టీకీ ఉద్దేశించినవి కావన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top