మోడీ విషయంలో హామీ ఇవ్వని అద్వానీ | Advani does not guarantee Narendra Modi as PM Candidate | Sakshi
Sakshi News home page

మోడీ విషయంలో హామీ ఇవ్వని అద్వానీ

Sep 11 2013 5:36 PM | Updated on Aug 15 2018 2:14 PM

మోడీ విషయంలో హామీ ఇవ్వని అద్వానీ - Sakshi

మోడీ విషయంలో హామీ ఇవ్వని అద్వానీ

బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఆ పార్టీ సీనియర్‌ నేత ఎన్కె అద్వానీ ఎటువంటి హామీ ఇవ్వలేదు.

న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ  విషయంలో  ఆ పార్టీ  సీనియర్‌ నేత ఎన్కె అద్వానీ ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఆ పార్టీ  అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ఈరోజు అద్వానీతో సమావేశమయ్యారు. ప్రధాని అభ్యర్థి విషయమై వారు చర్చించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు ప్రకటించాలని  రాజ్‌నాథ్‌ సింగ్ కోరారు. అయితే అద్వానీ మాత్రం రాజ్‌నాథ్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదు.

ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ కోరుతున్న విషయం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు వచ్చేవారం సమావేశం కానుంది.   సెప్టెంబర్ 17న మోడీ పుట్టిన రోజు. ఆలోగానే ఆయనను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement