ఆ విషయం ఇప్పుడే చెప్పలేను: ధనుష్ | Tamil actor Dhanush Ready to act Rajinikanth | Sakshi
Sakshi News home page

ఆ విషయం ఇప్పుడే చెప్పలేను: ధనుష్

Aug 25 2014 11:39 AM | Updated on Sep 2 2017 12:26 PM

ఆ విషయం ఇప్పుడే చెప్పలేను: ధనుష్

ఆ విషయం ఇప్పుడే చెప్పలేను: ధనుష్

ప్రముఖ హిందీ నటుడు అమితాబ్‌బచ్చన్‌తో తాను నటిస్తున్న చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న విడుదల కానుందని తమిళ సినీ హీరో ధనుష్ తెలిపారు.

తిరుమల: ప్రముఖ హిందీ నటుడు అమితాబ్‌బచ్చన్‌తో తాను నటిస్తున్న చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న విడుదల కానుందని తమిళ సినీ హీరో ధనుష్ తెలిపారు. ప్రస్తుతం తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తున్నట్లు వివరించారు. తెలుగులో మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానన్నారు. తమ మామగారు రజనీకాంత్ తో కలిసి నటించే విషయం ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. అన్నీ కుదిరితే ఆయనతో కలిసి నటించేందుకు తనకెటువంటి అభ్యంతరం లేదని వెల్లడించారు.

తన భార్య ఐశ్వర్యతో కలిసి ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల వేంకటేశ్వరస్వామిని ధనుష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వీరితోపాటు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కూడా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సినీ నటి ప్రణీత కూడా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement