నేపాల్లో మరోసారి భూకంపం | one more earthquake in Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్లో మరోసారి భూకంపం

May 2 2015 10:57 AM | Updated on Sep 3 2017 1:18 AM

నేపాల్లో మరోసారి భూకంపం

నేపాల్లో మరోసారి భూకంపం

నేపాల్ మరోసారి మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రతను 4.5 గా అధికారులు గుర్తించారు. దీంతో గత వారంరోజులుగా భయం గుప్పిట్లో భయం భయంగా కాలం గడిపి, ఇపుడిపుడే తేరుకుంటున్న ప్రజలు మరోసారి ఆందోళనకు గురయ్యారు.

ఖాట్మాండు:   నేపాల్ లో మరోసారి  మరోసారి భూమి కంపించింది. శనివారం ఏర్పడిన భూప్రకంపనల తీవ్రతను రిక్టర్ స్కేల్పై  4.5  గా అధికారులు గుర్తించారు. దీంతో  గత  వారంరోజులుగా భయం గుప్పిట్లో భయం భయంగా కాలం గడిపి, ఇప్పుడిప్పుడే  తేరుకుంటున్న ప్రజలు మరోసారి ఆందోళనకు గురయ్యారు.   

మరోవైపు మళ్లీ భూమి కంపించవచ్చనే  హెచ్చరికల నేపథ్యంలో   ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లడానికి  భయపడిపోయారు. చలి, వర్షాన్ని  సైతం భరిస్తూ ఆరుబయటే కాలం గడుపుతున్నారు.   ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనుకున్న తరుణంలోమరోసారి భూమి కంపించడం ఆందోళనకు దారి తీసింది.


ఇది ఇలా ఉంటే  భూకంప మృతుల సంఖ్య 6,621 చేరినట్టు తెలుస్తోంది. దాదాపు 14,023 మంది గాయపడినట్టుగా నేపాల్ ప్రభుత్వం  వెల్లడించింది.   ఇప్పటికే  భూకంపం సంభవించి వారం రోజులైనందున  శిథిలాల కిందచిక్కుకున్న వారు బతికే అవకాశం లేదని ప్రభుత్వ ప్రతినిధి లక్ష్మీ ప్రసాద్  ఢాకాలో  తెలిపారు.   త్వరితగతిన  పరిస్థితిని చక్కదిద్దేందుకు తమ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని ఆయన తెలిపారు.  

 

ఇరవై దేశాల నుంచి వచ్చిన స్నిఫర్ డాగ్స్, వైద్య బృందం లాంటి వివిధ టీమ్ లు సహాయచర్యల్లో పాలుపంచుకుంటున్నాయని, గత గురువారం నుంచి  సజీవంగా ఉన్నవారిని వెలికి తీసిన ఘటనలు లేవని ఆయనన్నారు. కాగా సరిగ్గా గత శనివారం  సంభవించిన వరుస భూప్రకంపనలతో  నేపాల్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే.  దాదాపు 7.8  తీవ్రతతో సంభవించిన  ఈ తీవ్ర భూకంపంతో నేపాల్ నేలమట్టమైంది. వేలాదిమందిని పొట్టన పెట్టుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement