కుప్పకూలిన హెలికాప్టర్ | Helicopter crashes in Nepal, all 7 onboard feared dead | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన హెలికాప్టర్

Aug 8 2016 4:25 PM | Updated on Sep 4 2017 8:25 AM

కుప్పకూలిన హెలికాప్టర్

కుప్పకూలిన హెలికాప్టర్

నేపాల్లో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో అందులో ఉన్న ఓ చంటిబిడ్డతో సహా ఏడుగురు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

ఖట్మాండు: నేపాల్లో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో అందులో ఉన్న ఓ చంటిబిడ్డతో సహా ఏడుగురు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. నేపాల్ రాజధాని ఖట్మాండుకు 150 కిలోమీటర్ల దూరంలోని నువాకోట్ జిల్లాలో గల భతిన్ దండ ప్రాంతంలో ఈ చాపర్ కూలిపోయినట్లు స్పష్టం చేశారు.

ది ఫిష్ టెయిల్ ఎయిర్ కంపెనీకి చెందిన 9ఎన్-ఏకేఏ అనే ఓ ప్రైవేటు హెలికాప్టర్  గోర్ఖా ప్రాంతం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ తో సిగ్నల్స్ తెగిపోయాయని మధ్యహ్నాం ఈ ప్రమాదపు ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. కాగా, ఒక పైలెట్తో సహా ఏడుగురు చనిపోయి ఉంటారని తాము భావిస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రమాద స్థలికి నేపాల్ ఆర్మీ, ఇతర సహాయక సిబ్బంది వెళ్లింది. వాతావరణం సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని వారు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement