చైనా షెంజన్ పారిశ్రామిక వాడలో సోమవారం భారీగా కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఇప్పటి వరకు ఓ మృతదేహాన్నివెలికి తీసినట్లు ఉన్నతాదికారులు మంగళవారం వెల్లడించారు.
బీజింగ్ : చైనా షెంజన్ పారిశ్రామిక వాడలో సోమవారం భారీగా కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఇప్పటి వరకు ఓ మృతదేహాన్నివెలికి తీసినట్లు ఉన్నతాదికారులు మంగళవారం వెల్లడించారు. 85 మంది ఆచూకీ తెలియలేదని తెలిపారు. వారు శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉందన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారిలో 32 మంది మహిళలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం భారీగా సిబ్బందిని రంగంలోకి దింపామన్నారు.