కాంగ్రెస్‌ బతికే అవకాశం లేదు: కొప్పుల | Koppula Ishwar commented on congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ బతికే అవకాశం లేదు: కొప్పుల

Apr 11 2017 3:59 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌ బతికే అవకాశం లేదు: కొప్పుల - Sakshi

కాంగ్రెస్‌ బతికే అవకాశం లేదు: కొప్పుల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బతికే అవకాశమే లేదని, ఆ పార్టీ పునాదులను టీఆర్‌ఎస్‌ కదిలిస్తోందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బతికే అవకాశమే లేదని, ఆ పార్టీ పునాదులను టీఆర్‌ఎస్‌ కదిలిస్తోందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోన్న ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతలు అక్కసంతా వెళ్లగక్కుతున్నారని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

ఒక వైపు రాష్ట్రంలో అభివృద్ధి జరగుతోందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విజయవాడలో చెప్పగా, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క మాత్రం అసలు అభివృద్ధి జరగడం లేదనడం శోచనీయమన్నారు. భట్టి విక్రమార్క గాంధీ భవన్‌లో కూర్చుని సీఎం కేసీఆర్‌ కుటుంబంపై విషంగక్కడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఆయన తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement