విడిపోదామన్న విషయం నాకు తెలియదు: కామినేని | Kamineni comments on BJP , TDP split | Sakshi
Sakshi News home page

విడిపోదామన్న విషయం నాకు తెలియదు: కామినేని

Sep 1 2016 6:41 PM | Updated on Mar 29 2019 9:31 PM

విడిపోదామన్న విషయం నాకు తెలియదు: కామినేని - Sakshi

విడిపోదామన్న విషయం నాకు తెలియదు: కామినేని

బీజేపీతో విడిపోదామని ముఖ్యమంత్రి అన్న విషయం తనకు తెలియదని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.

బీజేపీతో  స్నేహపూర్వకరంగా విడిపోదామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న విషయం తనకు తెలియదని ఆ పార్టీ నేత, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూస్తారని చెప్పారు. తిరుపతి సభలో పవన్ ప్రత్యేక హోదాపై ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించారన్నారు.


మూడవ విడత కౌన్సిలింగ్
మూడో విడత మెడికల్ కౌన్సిలింగ్‌ని ఈ నెల 25,26 తేదీల్లో నిర్వహిస్తామని మంత్రి కామినేని ప్రకటించారు. కౌన్సిలింగ్ సందర్భంగా చివరి నిమిషంలో అభ్యర్ధులు విత్‌డ్రా అయితే ధ్రువీకరణ పత్రాలను వెనకకు ఇవ్వబోమని చెప్పారు. అభ్యర్ధుల చర్య వల్ల వంద సీట్లను నష్టపోతున్నామన్నారు. బీ కేటగిరిలో డబ్బులు కట్టిన విద్యార్ధులకు గవర్నమెంట్ కోటాలో ఎ కేటగిరి క్రింద సీటు వస్తే ఎటువంటి మినహాయింపు లేకుండా సీటు ఇవ్వాలని మంత్రి కామినేని అధికారులను ఆదేశించారు. కౌన్సిలింగ్‌లో దళారులను నమ్మవద్దని అభ్యర్ధులకు సూచించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ క్రింద పీజీకి గ్రేస్ మార్కులను ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement