హుమాయున్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది
హైదరాబాద్: నగరంలోని హుమాయున్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మల్లేపల్లిలోని ఓ దుకాణంలో ప్రమాదవశాత్తు అగ్నికీలలు ఎగిసిపడటంతో.. పక్కనే ఉన్న మరో నాలుగు షాపులకు మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.
రగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.