‘రాత’ బాగలేకపోయినా... శైలి బాగుండాలి | 'Written' not super but ... Style crucial in examinations | Sakshi
Sakshi News home page

‘రాత’ బాగలేకపోయినా... శైలి బాగుండాలి

Feb 15 2016 10:45 PM | Updated on Sep 26 2018 3:23 PM

‘రాత’ బాగలేకపోయినా... శైలి బాగుండాలి - Sakshi

‘రాత’ బాగలేకపోయినా... శైలి బాగుండాలి

కనీసం రెండు కాపీల హాల్‌టికెట్స్ రెడీ చేసుకోవాలి. హాల్‌టికెట్‌తో పాటు పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్...

ఎగ్జామ్ టిప్స్
కనీసం రెండు కాపీల హాల్‌టికెట్స్ రెడీ చేసుకోవాలి. హాల్‌టికెట్‌తో పాటు  పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్... వంటివి సరైన రీతిలో  సిద్ధం చేసుకోవాలి. పరీక్ష హాల్లో ఏదీ ఎవరినీ అడిగే పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలి.

జవాబులు రాయడంలో నాణ్యమైన శైలిని ప్రదర్శించడం ముఖ్యం. అవసరమైనంత మార్జిన్లు వదలడం, ప్రశ్నల నంబర్లు సరిగా రాయడం, ప్రతి ప్రశ్న-సమాధానానికి మధ్యలో తగినంత స్థలం వదలడం, సబ్ హెడ్డింగ్స్‌కు, ముఖ్యమైన నిర్వచనాలకు  అండర్‌లైన్ చేయడం మీ జవాబు పత్రాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతుంది. మీ చేతిరాత అంత అందంగా లేకపోయినప్పటికీ పై జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఆ లోపం చాలా వరకూ కనుమరుగవుతుంది.
     
అండర్ లైన్ చేయడానికి రెడ్ ఇంక్ వినియోగించవద్దు. మరేదైనా కలర్ ఫర్వాలేదు. తప్పులు గుర్తించడానికి, మార్కులు ఇవ్వడానికి ఎగ్జామినర్ రెడ్ ఇంక్ వినియోగిస్తారు. కాబట్టి విద్యార్థులు రెడ్ ఇంక్ వాడకూడదు.
     
విద్యావిధానంలో పరీక్షలనేవి ఒక భాగం. వీటి పట్ల సానుకూల దృక్పథం పెంచుకుంటే మీలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
     
ఈ సమయంలో కొంత మంది స్నేహితులు అప్రధానమైన అంశాలను ప్రస్తావించి మీలో భయాన్ని రేకెత్తించే ప్రయత్నం చేయవచ్చు. వాటిని పట్టించుకోకండి. మీ మానసికస్థైర్యాన్ని వినియోగించుకుంటూ పెద్దలు, ఉపాధ్యాయుల సలహా సూచనల మేరకు కృషిచేయండి.  
     
విద్యార్థులు ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. కేవలం నీళ్ళు మాత్రమే కాకుండా పండ్లు, జావ వంటివి తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement