దీంట్లో ఉతకండి... కరెంట్‌ బిల్‌ రాదు

Washing the clothes on the washing machine decreases - Sakshi

పరి పరిశోధన

వాషింగ్‌ మెషీన్‌లో బట్టలుతికితే శ్రమ తగ్గుతుంది నిజమే కాని కరెంటు బిల్లు బాదడం మాత్రం ఖాయం. కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న వాషింగ్‌మెషీన్‌ మాత్రం రూపాయి యూనిట్‌ కూడా కాల్చదు.. అసలు కరెంటే వాడనివ్వదు. అదెలా అనుకుంటున్నారా? చాలా సింపుల్‌. యంత్రం పక్కనే ఉన్న పిడిని చూశారుగా. దాన్ని గిర్రున తిప్పాలి అంతే. నీటిపైపును అనుసంధానించి సోప్‌పౌడర్‌ వేసి రెండు నిమిషాలు తిప్పితే ఉతకడం అయిపోతుంది. ఆ తరువాత రెండు నిమిషాలు నీళ్లతో జాడించడానికి, ఇంకో నిమిషం నీరు మొత్తాన్ని తీసేయడానికి ఖర్చవుతాయి.

పిడిని తిప్పడం కష్టం కదా అనుకోకండి. అతితక్కువ బలంతో తిరిగేలా పిడిని డిజైన్‌ చేశామని కంపెనీ అంటోంది. నెదర్లాండ్స్‌కు చెందిన ‘జెంటిల్‌ వాషర్‌’ అనే కంపెనీ అదే పేరుతో ఈ యంత్రాన్ని మార్కెట్‌ చేస్తోంది. ఒకసారికి దాదాపు 12 టీ షర్టులను ఈ యంత్రంలో వేసి ఉతికేయవచ్చు. సాధారణ వాషింగ్‌ మెషీన్‌తో పోలిస్తే సగం కంటే తక్కువ నీటితో ఉతకగలగడం దీని ప్రత్యేకత. ఫ్రంట్‌ లోడింగ్‌ వాషింగ్‌ మెషీన్‌కు సమానమైన నాణ్యతతో జెంటిల్‌ వాషర్‌ పని చేస్తుందని ఇప్పటికే తేలిందట.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top