బ్యూటిప్స్‌

Beauty tips:natural face wash - Sakshi

ముడతల నివారణకు...అరటిపండు – 1క్యాబేజీ ఆకులు – రెండు కోడిగుడ్డు – 1 (తెల్లసొన మాత్రమే)

తయారి: అరటిపండు ముక్కలుగా కట్‌ చేయాలి. దీనితో పాటు క్యాబేజీ ఆకుల ను సన్నగా తరగాలి. ఈ రెంటినీ మిక్సర్‌ లో వేసి పేస్ట్‌ చేయాలి. దీంట్లో కోడిగుడ్డు తెల్లసొన వేసి కలపాలి. తర్వాత ముఖ మంతా అప్లై చేయాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్‌ ప్యాక్‌ వల్ల ముఖం మీద ముడతలు తగ్గుతాయి.

క్లెన్సింగ్‌ ఫేస్‌ ప్యాక్‌
కావలసినవి: క్యారెట్లు – రెండు (ముక్కలుగా కట్‌చేసుకోవాలి), క్యాబేజీ తురు ము – టేబుల్‌ స్పూన్, టొమాటో – 1
తయారి: క్యాబేజీ తురుము, టొమాటో, క్యారెట్‌  ముక్కలు మిక్సర్‌లో వేసి మెత్తగా పేస్ట్‌ చేసి, మూడు చుక్కల తేనెతో కలపాలి. శుభ్రం చేసుకున్న ముఖానికి మెడకి ఈ పేస్ట్‌ అప్లై చేయాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది. వారానికి ఒకసారి ఈ ఫేస్‌ప్యాక్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top