టీడీపీ నేతల బరితెగింపు | school flag pole removed by tdp leaders in srikakulam | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల బరితెగింపు

Dec 7 2015 10:23 AM | Updated on Sep 15 2018 5:45 PM

టీడీపీ నేతల బరితెగింపు - Sakshi

టీడీపీ నేతల బరితెగింపు

అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చన్న రీతిలో.. టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు.

  •      పాఠశాలలో జాతీయ జెండా స్థూపం పెరికివేత
  •      మరోచోట పచ్చరంగు వేసి,
  •      టీడీపీ జెండా ఎగురవేసి...
  • శ్రీకాకుళం: అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చన్న రీతిలో.. టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. అంధవరం పంచాయతీ రామకృష్ణాపురంలో ఆదివారం జరిగిన జనచైతన్య యాత్రలో మితిమీరి ప్రవర్తించారు. ఇక్కడ ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్న జాతీయ జెండా స్థూపాన్ని పెకలించి గ్రామం మధ్యలో పెట్టి పసుపు రంగు వేసి టీడీపీ జెండా కట్టి పండగ చేసుకున్నారు. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పటికప్పుడు, పాఠశాల ముందు తాత్కాలికంగా స్థూపం కోసం సిమెంటు దిమ్మకట్టి చేతులు దులుపుకున్నారు.

     

    దీనిపై హెచ్‌ఎం పి.రామకృష్ణను సంప్రదించగా, జాతీయ జెండా స్థూపాన్ని తొలగించడం నేరమని చెప్పారు. దీన్ని తొలగిస్తామని తనకు ముందుగా ఫోన్ చేయగా వ్యతిరేకించానని, అయినా ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో పెకలించి వేశారని చెప్పారు. దీనిపై కలెక్టరుకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీపీ, జెడ్పీటీసీ ప్రతినిధులు కొయ్యాన సూర్యారావు, మెండ రాంబాబుతోపాటు మరికొందరు గ్రామస్తులు తెలిపారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement