నటనకు శ్రీకారం చుట్టింది ఇక్కడే.. | actor rajendraprasad in nanayya university | Sakshi
Sakshi News home page

నటనకు శ్రీకారం చుట్టింది ఇక్కడే..

Jan 30 2017 10:44 PM | Updated on Sep 18 2019 3:24 PM

నటనకు శ్రీకారం చుట్టింది ఇక్కడే.. - Sakshi

నటనకు శ్రీకారం చుట్టింది ఇక్కడే..

తూర్పు గోదావరి జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమని, ముఖ్యంగా నటుడిగాను, హీరోగాను శ్రీకారం చుట్టింది రాజమహేంద్రవరంలోనేనని ప్రముఖ సినీ నటుడు, మూవీ ఆర్టిస్టŠస్‌ అసోసియేష¯ŒS (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

  • గోదారి గడ్డ అంటే అందుకే అభిమానం
  • సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌
  • రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) :
    తూర్పు గోదావరి జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమని, ముఖ్యంగా నటుడిగాను, హీరోగాను శ్రీకారం చుట్టింది రాజమహేంద్రవరంలోనేనని ప్రముఖ సినీ నటుడు, మూవీ ఆర్టిస్టŠస్‌ అసోసియేష¯ŒS (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. అందుకే తనకు ఈ జిల్లా అన్నా, ఈ ప్రాంతమన్నా అభిమానమని చెప్పారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ప్రారంభమైన ఎ¯ŒSఎస్‌ఎస్‌యూత్‌ ఫెస్టివల్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
    ∙‘లేడీస్‌ టైలర్‌’ షూటింగ్‌ పూర్తయి హైదరాబాద్‌ వెళ్లిన తరువాత కూడా ఎవరైనా పిలిస్తే ‘ఆయ్‌’ అంటూ.. ఇక్కడి మాండలీక ప్రభావం నుంచి కొన్ని రోజులు బయటపడలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరిని పలకరించినా వారి మాటల్లో కూడా ‘ఎటకారం’ ఉండేది.
    ∙‘క్విక్‌ గ¯ŒS మురుగ¯ŒS’ చిత్రం ద్వారా హాలీవుడ్‌ సినిమాలో హీరోగా నటించిన తొలి తెలుగు నటుడుగా గుర్తింపు లభించడం ఒకింత గర్వంగా ఉంది. నిజానికి మన తెలుగు సినిమా స్థాయి నేడు అంతర్జాతీయ స్థాయి వెళ్తోంది. బాహుబలి, శాతకర్ణి సినిమాలు అందుకు మార్గం చూపాయి.
    ∙మా అబ్బాయిని హీరోను చేద్దామనుకున్నాను. కానీ, అతడికి వ్యాపారాలపైనే ఎక్కువ ఆసక్తి ఉండటంతో ఫోర్స్‌ చేయలేదు.
    ∙మా ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారి గురించి సర్వే చేసి కంప్యూటరీకరిస్తాం. వీరిని రెడ్, ఎల్లో, గ్రీ¯ŒS అనే మూడు కేటగిరీలుగా విభజించి, వారి అవసరాలు ఏమిటో తెలుసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. రెడ్‌ కేటగిరీలో ఉన్న వారందరికీ నా హయాం పూర్తయ్యేలోగా బైకులు కొనిస్తాం. ఈ పని ఇంతవరకూ ఎవ్వరూ చేయలేదు.
    ∙మన చరిత్ర, సంస్కృతుల గురించి పౌరాణిక చిత్రాల ద్వారా నేటి తరాలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. బాహుబలి, శాతకర్ణి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న తరుణంలో పౌరాణిక చిత్రాలను కూడా ఆదరిస్తారనే నమ్మకం కలుగుతోంది. అయితే వీటిని చిత్రీకరించడం గతంలో మాదిరిగా తేలికైన విషయం కాదు. ఎంతో ఖర్చుతో కూడిన వ్యవహారం.
     
    ప్రత్యేక హోదాపై నో కామెంట్‌
     
    ఏపీకి ప్రత్యేక హోదా విషయమై స్పందించేందుకు రాజేంద్రప్రసాద్‌ నిరాకరించారు. ‘నో కామెంట్‌’ అంటూ తప్పించుకున్నారు. తమిళనాడులో జల్లికట్టు కోసం అక్కడి సినీ పరిశ్రమ అంతా ఏకమై స్పందించిన విషయాన్ని ప్రస్తావించగా.. ‘తాను వివాదాలకు దూరంగా ఉంటానని, అందుకే ప్రత్యేక హోదాపై మాట్లాడలేకపోతున్నానని అన్నారు. అయినా ఆలోచిస్తానని చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement