లాక్‌డౌన్ ఎఫెక్ట్ : మహాపతనం | Sensex opens 2307 points lower | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : మహాపతనం

Mar 23 2020 9:33 AM | Updated on Mar 23 2020 12:09 PM

Sensex opens 2307 points lower  - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్  మార్కెట్ మరోసారి మహా పతనాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, లాక్ డౌన్ ప్రకంపనలతో  కీలక సూచీలు నష్టాల బాటపట్టాయి. సెన్సెక్స్ 2687 పాయింట్లు  పతనం కాగా  నిఫ్టీ నిఫ్టీ 874 పాయింట్ల నష్టంతో వద్ద  ట్రేడింగ్ అరంభించాయి. తద్వారా  సెన్సెక్స్  28వేల స్థాయిని, నిఫ్టీ 8వేల  స్థాయిని కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే  ఫార్మ రంగ షేర్ల లాభాలతో సూచీలు భారీ నష్టాలనుంచి భారీ రికవరీ సాధించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 2198 పాయింటు నష్టంతో 27707వద్ద, నిఫ్టీ 628 పాయింట్ల నష్టంతో 8118వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement